సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వాయిదా

సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వాయిదా

న్యూఢిల్లీ :  జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్షిప్ లేదా  అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం నిర్వహించే జాయింట్ సీఎస్ఐఆర్–-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వాయిదా వేసింది. జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్-–యూజీసీ నెట్ ను 

అనివార్య పరిస్థితుల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నామని ఎన్టీఏ శుక్రవారం ప్రకటించింది. ఎగ్జామ్ కు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.