పొట్టేల్ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

పొట్టేల్ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్ఖురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొట్టేల్‌‌‌‌’.  నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు  విడుదల చేయగా, రీసెంట్‌‌‌‌గా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది.  ఇలాంటి కంటెంట్ మలయాళ చిత్రాల్లో  ఎక్కువగా చూస్తుంటాం. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. రూరల్ సినిమాలను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.  

యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ ‘ఇది మన మట్టికథ. స్క్రీన్‌‌‌‌ప్లేలోని మ్యాజిక్ ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది. మంచి ఎమోషన్‌‌‌‌తో సాగే పక్కా కమర్షియల్ సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌కి  మరింతగా హత్తుకుంటుంది’ అని చెప్పాడు. తన  కెరీర్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్ సినిమా అవుతుందని  అనన్య నాగళ్ల చెప్పింది. ఈ చిత్రం ఎమోషనల్ రైడ్‌‌‌‌కి తీసుకెళుతుందని దర్శకుడు సాహిత్ అన్నాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. నటుడు అజయ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.