
తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు జీవితంపై ఓ సినిమా రానుంది. ‘అమరజీవి పొట్టి శ్రీరాములు’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘నా ఊపిరి’ ఫేమ్ కన్మణి దర్శకుడు. కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోనూ కొంత భాగం షూట్ చేయ నున్నారు. సాలూరి వాసూరావు సంగీతం అందిస్తున్నాడు. వెనిగళ్ల రాంబాబు రాసిన ‘తెలుగే మన ఆత్మబలం.. తెలుగే మన ఆయుధం.. తెలుగే మన ఊపిరి’ అనే పాటను నిన్న రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పొట్టి శ్రీరాములు మనవరాళ్లు రేవతి, అనూరాధ, సారథి స్టూడియోస్ డైరెక్టర్ కేవీ రావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, ప్రతాని రామకృష్ణ గౌడ్, ఎడిటర్ కె.ఎల్. ప్రవీణ్ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ సాధించాలంటూ టీమ్‌కి విషెస్ చెప్పారు.