
ఆటో కంపెనీ ఎంజీ మోటార్స్ ఇటీవల లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్ పీపీఎస్ మోటార్స్ ద్వారా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కేవలం 300 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉంటాయి.
హెడ్‌రెస్ట్‌లపై ఎంబ్రాయిడరీ చేసిన 'ఇన్‌స్పైర్' లోగో, లోపల గోల్డ్ యాక్సెంట్స్, ఇన్‌స్పైర్ కుషన్లు, 3డీ మ్యాట్స్, వెనుక విండో సన్‌షేడ్స్, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ , వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. డాష్‌క్యామ్ కూడా ఉంటుంది. ఒక్కసారి చార్జ్‌చేస్తే 332 కి.మీ వెళ్తుంది. బ్యాటరీతో కూడిన వెర్షన్ ధర సుమారు రూ. 16.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, బ్యాటరీ -యాజ్ -ఏ -సర్వీస్ ఆప్షన్ ధర సుమారు రూ. 9.99 లక్షలు.