బాలకృష్ణ షోలో ప్రభాస్, గోపీచంద్‌‌‌‌ ?

బాలకృష్ణ షోలో ప్రభాస్, గోపీచంద్‌‌‌‌ ?

హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూట్ పూర్తవగా.. సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఈ రెండింటితో పాటు మారుతి డైరెక్షన్‌‌‌‌లో ‘రాజా డీలక్స్‌‌‌‌’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. హారర్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే ఈ కమర్షియల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి వరుస అప్‌‌‌‌డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందని.. మాళవిక మోహనన్‌‌‌‌, నిధి అగర్వాల్‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌ అని మొదట వినిపించింది. ఇటీవల మూడో హీరోయిన్‌‌‌‌గా రిద్ది  కుమార్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్ చేసినట్టు వార్తలొచ్చాయి.

ఇక తాజాగా ఈ సినిమా కోసం థియేటర్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌ వేస్తున్నట్టు టాక్. వాడుకలో లేని ఓ పాత థియేటర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరిగే కథ కావడంతో పది కోట్లతో ఈ సెట్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌‌‌‌కు విలన్‌‌‌‌గా సంజయ్‌‌‌‌దత్‌‌‌‌ నటించడం దాదాపు ఖాయమైందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలా ఈ మూవీకి సంబంధించి రోజుకో కొత్త అప్‌‌‌‌ డేట్ తెరపైకి వస్తోంది. మొత్తానికి ఇంతవరకూ అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ అయితే చేయలేదు కానీ.. క్యాస్టింగ్‌‌‌‌తో పాటు షూటింగ్‌‌‌‌ విషయంలో సూపర్ స్పీడుతో ముందుకెళుతున్నాడు దర్శకుడు మారుతి. ఇదిలా ఉంటే బాలకృష్ణ హోస్ట్‌‌‌‌గా వ్యవహరిస్తోన్న ‘అన్‌‌‌‌స్టాపబుల్‌‌‌‌’ షోలో ప్రభాస్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా రాబోతున్నాడు. ప్రభాస్‌‌‌‌కు బెస్ట్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ అయిన గోపీచంద్‌‌‌‌ కూడా పాల్గొనబోతున్నాడని, అతి త్వరలో ఈ షూట్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. చాలా తక్కువగా మాట్లాడే ప్రభాస్‌‌‌‌.. బాలకృష్ణ షోలో ఏయే విషయాలు షేర్ చేసుకుంటాడో చూడాలి!