ప్రభాస్ 100 అడుగుల కటౌట్.. పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్

ప్రభాస్ 100 అడుగుల కటౌట్.. పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్

ఆదిపురుష్(Adipurush) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి(Thirupathi)లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఇక ఈ ఈవెంట్ కోసం మేకర్స్ చేస్తున్న ఖర్చు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇలా ఇండియా వైడ్ గా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ మ్యానియానే కనిపిస్తోంది.

ఇక తాజగా ఈ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రభాస్(Prabhas) కటౌట్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈవెంట్ జరగనున్న గ్రౌండ్లో 100 అడుగుల(100 feet) ప్రభాస్ కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. ఇక ఈ కటౌట్ కు పాలాభిషేకాలు కూడా నిర్వహించారు. ముందే ప్రభాస్ ను దైవంలా భావించే ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు రాముడిగా కనిపిస్తుండటంతో పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభాస్ కు పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ జై శ్రీరామ్, జై శ్రీరామ్(Jai Shreeram) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రిలీజ్ కు ముందే ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.