
రీసెంట్‌గా ‘సలార్’తో సాలిడ్ సక్సెస్‌ను అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎలాంటి అప్‌డేట్, అనౌన్స్‌మెంట్ చేయకుండా సైలెంట్‌గా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించగా, ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఊరిస్తూ శనివారం మరో అప్‌డేట్ ఇచ్చారు.
సంక్రాంతి రోజున (సోమవారం) ఉదయించే సూర్యుడితో పాటు, మీ రెబల్ స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్‌లో అందరికీ డబుల్ ట్రీట్ అందించడానికి త్వరగా ఉదయిస్తాడు. ఉదయం 7:08 నిమిషాలకు టైటిల్, ఫస్ట్‌లుక్‌ని రివీల్ చేస్తూ డబుల్ ఫీస్ట్‌ని అందించబోతున్నాడు’ అని మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మారుతి రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. వివేక్ కూఛిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.