‘ఆదిపురుష్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్‌

‘ఆదిపురుష్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుండి తాజాగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆదిపురుష్ రూపానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఆరున్నర అడుగుల సుందర రూపంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. విల్ల చేతబట్టి యుద్ధానికి బయల్దేరినట్లుగా ఉన్నాడు. అతడి ముఖంలో ఎంతో తేజస్సు.. అతడి బాణంలో రౌద్రం కనిపిస్తున్నాయి. ప్రభాస్ వెంట వానరసేన కూడా కదిలివస్తోనట్లు ఈ పోస్టర్ లో చూడవచ్చు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను టీ సిరీస్‌, రెట్రో ఫైల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న తెలుగు, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.