ఇది డైనోసార్ డామినేషన్.. అడ్వాన్స్ బుకింగ్స్లో వార్ వన్ సైడ్

ఇది డైనోసార్ డామినేషన్.. అడ్వాన్స్ బుకింగ్స్లో వార్ వన్ సైడ్

ఈ ఏడాది చివర్లో బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద క్లాష్ జరగనుంది. ఓపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సలార్(Salaar) తో మూవీతో వస్తుంటే.. మరోపక్క బాలీవుడ్ బాద్షా  షారుఖ్(Shahrukh) డంకీ(Dunki) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం.. వార్ వన్ సైడ్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. 

అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే సలార్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఓవర్ సీస్ మార్కెట్ లెక్కలు కూడా అప్పుడే బయటకు వచ్చేశాయి. ఆస్ట్రేలియాలో సలార్ సినిమా 119 షోలకు గాను 69 వేలు కలెక్ట్ చేయగా.. డంకీ సినిమాకు 57 షోలకు 6 వేలు కూడా దాటని పరిస్థితి. అమెరికాలో సైతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే 1000 పైగా షోలతో సలార్ హాఫ్ మిలియన్ క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉండగా.. డంకీ సినిమా కేవలం 50 వేల డాలర్ల దగ్గరే ఉంది. ఈ లెక్కలు డంకీ సినిమా సలార్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. బాక్సాఫీస్ పోటీలో కూడా వార్ వన్ సైడ్ అయ్యేలా ఉందని ట్రేడ్ అనలిస్టులు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి జవాన్,పఠాన్ వంటి వరుస బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు షారుక్ ఖాన్. అయినప్పటికి డంకీ సినిమాకు అంతగా బజ్ క్రియేట్ అవడం లేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. అయన నుండి వచ్చిన గత మూడు సినిమాలి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా కూడా సలార్ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో సలార్ లెక్కలు మారుతున్నాయి. కేవలం మొదటిరోజు మాత్రమే కాదు.. ఓవరాల్ గా కూడా సలార్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా.. ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవడం మాత్రం పక్కా.