సలార్ మూవీ.. 3 గంటలా.. అంత అద్భుతంగా ఉందా..!

సలార్ మూవీ.. 3 గంటలా.. అంత అద్భుతంగా ఉందా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా.. సలార్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది.. డిసెంబర్ 22వ తేదీన ధియేటర్లలో సందడి చేయబోతుంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్మురేపుతోంది.. మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత.. క్రమంగా పాజిటివ్ టాక్ రావటం.. ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తుంది.. 

మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. సలార్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. మొన్నటికి మొన్న ఆదిపురుష్ నిరుత్సాహ పరిచిన తర్వాత వస్తున్న.. మాస్ మసాలా మూవీ సలార్ కావటం సినీ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో మరో కీలక అప్ డేట్ వచ్చింది. సలార్ మూవీ 2 గంటల 55 నిమిషాలు ఉందంట.. ఓవరాల్ గా 3 గంటల సినిమా అంట.. అంతే కాదు.. సలార్ మూవీకి A.. ఏ సర్టిఫికెట్ జారీ చేయటం కూడా విశేషం..

యాక్షన్ పార్ట్స్ ఎక్కువ ఉన్నాయంట.. వయలెన్స్ మాంచి కిక్ ఇస్తుందనేది సినీ ఇండస్ట్రీ టాక్. ఫైటింగ్స్ బాగా వచ్చాయని.. సలార్ మూవీలో ప్రభాస్ నటనలోని మరో కోణాన్ని చూస్తారనేది యూనిట్ బలంగా.. గట్టిగా చెబుతున్న మాట..

కాకపోతే 3 గంటల సినిమా అనే సరికి.. సినీ ప్రేక్షకుల్లో డివైట్ టాక్ వినిపిస్తుంది.. ఇంత పెద్ద రన్ టైం ఉండటం కొన్ని సార్లు నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని.. కథ, కథనం అద్భుతంగా ఉంటేనే 3 గంటల రన్ టైం అయినా బోరు కొట్టదు అనేది అభిమానుల మాట.. ప్రభాస్ జోడీగా.. శృతిహాసన్, ఆద్య నటిస్తుండగా.. పాన్ ఇండియాగా.. ఐదు భాషల్లో మూవీ రిలీజ్ అవుతుంది.