మాస్ కటౌట్.. క్లాస్ స్టోరీ.. మరి రిజల్ట్

మాస్ కటౌట్.. క్లాస్ స్టోరీ.. మరి రిజల్ట్

టాలీవుడ్ లో మాస్ కటౌట్ ఉన్న హీరో అంటే ప్రభాస్ అనే చెప్పాలి. అందుకే.. ఆయన హైట్, పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కథలు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఛత్రపతి, మున్నా, బాహుబలి,సాహూ ఇప్పుడు రాబోతున్న సలార్ సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. అయితే తాజాగా ప్రభాస్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు లేదా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం క్లాస్ సినిమాల దర్శకుడు హను రాఘవపూడిని లైన్లో పెట్టారని సమాచారం. హను చెప్పిన కథ నిర్మాతలకి బాగా నచ్చిందట. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన సీతారామమ్ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం హను అయితేనే బాగుటుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

ప్రస్తుతం ఈ కథ కోసం ప్రభాస్ ని ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారట. ప్రభాస్ ప్రస్తుతం.. ఆదిపురుష్, సలార్, మారుతీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు కంప్లీట్ ఐన వెంటనే.. హను సినిమా ఒకే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ క్లాస్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ క్లాస్ సినిమాకి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే కొన్ని రోజులు కాదు.. కొన్ని ఇయర్స్ ఆగాల్సిందే.