సీతారామంను థియేటర్ లోనే చూడాలి

సీతారామంను థియేటర్ లోనే చూడాలి

ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు అని రెబల్ స్టార్ ప్రభాస్ అన్నారు. ఇవాళ సీతారామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి..అలాగే సీతా రామం సినిమాని కూడా థియేటర్ లోనే చూడాలి తెలపాడు. ఇంట్లో దేవుడు ఉన్నాడు అని గుడికి వెళ్ళడం మనేస్తామా ఇది అంతే..మాకు థియేటర్స్ గుడి లాంటివి. తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడండి అని ప్రభాస్ కోరారు. 

స్వప్న దత్ మాట్లాడుతూ.. ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు.. రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు అని తెలపారు. కాగా, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమానే 'సీతా రామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్లకు రానుంది. ఇంతవరకూ మరాఠీ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్, ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది.