'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' . ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా సెట్స్ నుండి ప్రభాస్ లుక్ లీక్ అయిందంటూ ఒక ఫోటో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అది చూసిన అభిమానులు "ఏం లుక్ రా బాబోయ్!" అంటూ పండగ చేసుకుంటున్నారు. కానీ, ఈ జోరులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
వైరల్ ఫోటోలో ఏముంది?
హైదరాబాద్‌లోని కొంపల్లి పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా ఎవరో రహస్యంగా తీసినట్టుగా ఉన్న ఆ ఫోటోలో.. ప్రభాస్ ఆల్ వైట్ పంచెకట్టు లుక్‌లో, పొడవాటి ఉంగరాల జుట్టుతో, స్టైలిష్ సన్ గ్లాసెస్ పెట్టుకుని, గన్ చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు. పక్కనే సెక్యూరిటీ, క్రూ మెంబర్స్ ఆయన్నే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ ఫోటో బయటకు రాగానే వంగా మార్క్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు.
అసలు నిజం ఏంటంటే..?
అయితే, ఈ ఫొటోను నిశితంగా పరిశీలించిన ఫ్యాన్స్ అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది సెట్స్ నుండి లీక్ అయిన ఒరిజినల్ ఫోటో కాదు, ఎవరో అత్యుత్సాహంతో AI ఉపయోగించి క్రియేట్ చేసిన ఫోటో. ప్రభాస్ ముఖ కవళికలు, చేతి వేళ్లు , బ్యాక్‌గ్రౌండ్‌లోని డీటెయిల్స్‌ను గమనిస్తే ఇది టెక్నాలజీ మ్యాజిక్ అని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఎవరో చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
IPS ఆఫీసర్ పాత్రలో..
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక ఇంటెన్స్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. "చిన్నప్పటి నుంచి నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది" అంటూ విడుదలైన ఆడియో టీజర్ ఇప్పటికే గూస్‌బంప్స్ తెప్పించింది. ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి నటిస్తుండగా, కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజాలు నటిస్తున్నారు. మార్చి 5, 2027న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇలాంటి ఫేక్ లీక్‌లను నమ్మకుండా, మేకర్స్ ఇచ్చే అఫీషియల్ అప్‌డేట్స్ కోసం వేచి చూడాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
SUPERSTAR #PRABHAS Look Leaked from Spirit Shooting 🔥🔥#Spirit #Sandeepreddyvanga pic.twitter.com/qfgLms8sDM
— Girish ✨ (@Girish__28) May 14, 2026
