టాలీవుడ్లో లీకుల బెడద దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారింది. సెట్స్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీకులు మాత్రం ఆగడం లేదు. టాప్ స్టార్స్ నటిస్తున్న అన్ని సినిమాల విషయంలోనూ ఇది జరుగుతోంది. అయితే ఇవి కొన్ని సినిమాలకి మంచే చేస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’కి ఈ లీకులు ప్లస్ అవుతున్నాయి. రీసెంట్గా ఈ మూవీ సెట్ నుంచి కొన్ని ఫొటోస్ లీకయ్యాయి. జీన్స్, టీషర్ట్‌లో రగ్డ్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ని చూస్తుంటే అతని పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తమ కామెంట్స్‌తో దుమ్ము రేపుతున్నారు. మాస్ అరైవల్, బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.
ప్రశాంత్ తీసిన ‘కేజీయఫ్ 2’ కూడా ‘సాలార్’పై ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. యశ్‌నే అలా చూపించాడంటే ఇక ప్రభాస్‌ని ఏ రేంజ్లో చూపిస్తాడో, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఇంకెంత స్పెషల్‌గా ఉంటాయో అంటూ చాలా ఎక్సయిటవుతున్నారు అభిమానులు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీయఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తూ ఉండటంతో బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ పాజిటివ్ బజ్ క్రియేటయ్యింది. ఇప్పటికే కొంత షూట్ పూర్తయింది. మే ఫస్ట్ వీక్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో ఇంపార్టెంట్ సీన్స్ తీయనున్నారు. ఈయేడు చివర్లో, లేదా వచ్చే యేడు ప్రారంభంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.