
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. అయితే, అందులో ముందువరుసలో ఉన్న ‘ది రాజా సాబ్’(TheRajasaab). ఈ సినిమా మాత్రం ఊరిస్తూ వస్తోంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది. దాంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అప్పుడెప్పుడో సైలెంట్గా షూటింగ్ మొదలు పెట్టి.. మధ్యలో పోస్టర్స్ లీక్ అవ్వడం, ఆ వెంటనే అఫిషీయల్ పోస్టర్స్ రావడం, మోషన్ పోస్టర్ తోనే లాగించారు మేకర్స్. ఇక ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యేలా చేశారు.
అయితే, మధ్యలో రిలీజ్ డేట్ ఏప్రిల్ 10 అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది. ఆ వెంటనే రిలీజ్ పోస్ట్ పోన్ కూడా అయింది. ఆ తర్వాత రాజాసాబ్ అసలు ఏం జరుగుతుందని కూడా అప్డేట్ లేదు. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్తో అంత గప్ చుప్ అయిపోయింది.
ఇక డార్లింగ్ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాడు. దీంతో షూటింగ్ రీస్టార్ట్ అయింది. ప్రస్తుతం దర్శకుడు మారుతి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ చిత్రీకరిస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ షెడ్యూలులోనే ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ మారుతి.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. దానికి ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు.
ఈ తరుణంలో 'ది రాజా సాబ్' నుంచి మరో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఈ మూవీ 2025 సెప్టెంబర్ 24న విడుదలవుతోందని టాక్. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ నిర్మాణ సమస్యల కారణంగా వాయిదా పడింది.
అయితే, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ రూమర్ వినిపించినా.. అది కూడా కన్ఫామ్ కాదని తెలుస్తోంది. మరి టీజర్లో రిలీజ్ డేట్ ప్రకటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే, ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు బ్రహ్మానందం ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఇది సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందుతోందని అంచనా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
HIGH ALERT…‼️
— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E