The Raja Saab Box Office: తెలుగులో రాజా దూకుడు.. ఇతర భాషల్లో నిరాశ.. ‘ది రాజా సాబ్’ 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

The Raja Saab Box Office: తెలుగులో రాజా దూకుడు.. ఇతర భాషల్లో నిరాశ.. ‘ది రాజా సాబ్’ 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ యాత్ర కొనసాగిస్తోంది. శుక్రవారం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, భారీ వసూళ్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ అందుకుంది. హారర్–కామెడీ జానర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజే (జనవరి 9న) ఇండియాలో రూ.112 కోట్ల గ్రాస్, రూ.63.3 కోట్ల నెట్ కలెక్షన్‌తో దూకుడు కనబరిచింది. అయితే రెండో రోజు మాత్రం తక్కువ వసూళ్లతో వెనుకంజలో నిలిచింది. శనివారం (జనవరి10న) కేవలం రూ.27.83 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. డే1తో పోలిస్తే సుమారు 48% కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి.

ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, ది రాజాసాబ్ మూవీ శనివారం, రెండో రోజున ఇండియాలో కేవలం రూ.27.83 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. (తెలుగులో రూ.22.38 కోట్లు, హిందీ రూ.5.2 కోట్లు, తమిళంలో రూ.15 లక్షలు, కన్నడలో రూ.6 లక్షలు, మళయాళంలో రూ.4 లక్షలు).

మొదటి రోజు + ప్రీమియర్‌లతో కలుపుకుని (రూ.53.75+9.15= 63కోట్లు) సాధించింది. డే1తో పోలిస్తే డే2 సుమారు 48% కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజుల ఇండియా నెట్ వసూళ్లను కలుపుకుని చూస్తే.. సుమారు రూ.90 కోట్ల నెట్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ల నుంచి వచ్చిన కలెక్షన్‌తో కలిపి ది రాజాసాబ్ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రభాస్‌కు ఉన్న బలమైన అభిమాన బలం మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ది రాజాసాబ్ రెండు రోజుల్లోనే $2 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఓవర్సీస్‌లో ప్రభాస్ సినిమాలకు ఉన్న స్టేబుల్ మార్కెట్‌ను మరోసారి రుజువు చేస్తోంది.

అయితే, పండుగ సీజన్‌తో పాటు వీకెండ్‌లో రాజా సాబ్’ విడుదలైనప్పటికీ, రెండో రోజుకు సినిమా వసూళ్లు గణనీయంగా తగ్గడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మిక్స్‌డ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో ప్రేక్షకుల స్పందన కీలకంగా మారింది.