Prabuthwa Junior Kalashala Review: ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ రివ్యూ.. ఈ టీనేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

Prabuthwa Junior Kalashala Review: ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ రివ్యూ.. ఈ టీనేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143. నిజజీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెరకెక్కించగా.. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(జూన్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా సినిమా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
వాసు(ప్రణవ్ ప్రీతం), కుమారి(షాజ్ఞ శ్రీ వేణున్) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు. కుమారి అందమైన అమ్మాయి కావడంతో ఆ కాలేజ్ లో సీనియర్స్, క్లాస్ మేట్స్, పాఠాలు చెప్పే గురువులు ఆమె దృష్టిలో పడాలని ట్రై చేస్తూ ఉంటారు. అందరిలాగే వాసు కూడా కుమారిని ఇష్టపడుతుంటాడు. చివరకి ఫ్రెండ్స్ బలవంతం కారణంగా ఒకరోజు కుమారికి ప్రపోజ్ చేస్తాడు. కుమారిని కూడా ప్రేమను అంగీకరించేలా చేస్తారు ఫ్రెండ్స్. మరి ఆ తరువాత ఎం జరిగింది? వీరి ప్రేమ ఎక్కడికి దారితీసింది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
నిజానికి టీనేజ్ లవ్ స్టోరీస్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. యూత్ కూడా ఇలాంటి సినిమాలకు బాగా కనెక్ట్ ఆవుతారు. అందుకే దర్శకుడు శ్రీనాథ్ పులకురం ఈ కథను ఎంపికచేసుకున్నట్టు ఉన్నాడు. రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని టీనేజర్ల మధ్య ఏర్పడే ప్రేమ, ఆకర్షణ వంటి అంశాలను తెరపై చాలా అందంగా చూపించారు. కానీ, కొత్త సినిమా చూసిన ఫీలింగ్ రాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజీ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సహజంగా కూడా ఉంటాయి. ఇక సెకండాఫ్ లో అపార్థాలు, టీనేజ్ లవ్ స్టోరీకి బ్రేక్, ఆ టైం లో వారి ఆలోచనన్లు వంటి సీన్స్ వస్తాయి. కనే సాగదీతగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా ఎండ్ చేయడం బాగుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు: 
టీనేజ్ కుర్రాడిగా ప్రణవ్ ప్రీతం సహజంగా నటించారు. ఆ కారణంగా ఎదో సినిమా చూస్తున్నట్టు కాకుండా రియల్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ కూడా చాలా క్యూట్ గా పక్కింటి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా చాలా అందంగా తెరకెక్కించారు. మిగతా వారు కూడా వారి వారి పాత్రల మేర ఆకట్టుకున్నారు.  

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. దర్శకుడు తాను ఎంచుకున్న కథను ఎలాంటి హడావుడి లేకుండా క్లీన్ గా ప్రెజెంట్ చేశాడు. నిజ జీవితంలో జరిగిన ఓ టీనేజ్ లవ్ స్టోరీని ఫుల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫి సినిమా మూడ్ కి తగ్గట్టుగా చాలా బాగా ఉంది. రియల్ లొకేషన్స్ ను చాలా అందంగా చూపించారు. ఇక సినిమాలో సంగీతం కూడా బాగుంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది.