అమిత్‌‌‌‌షా యాత్రను సక్సెస్‌‌‌‌ చేయాలి : ప్రదీప్‌‌‌‌రావు

అమిత్‌‌‌‌షా యాత్రను సక్సెస్‌‌‌‌ చేయాలి : ప్రదీప్‌‌‌‌రావు

వరంగల్​సిటీ, వెలుగు : ఈ నెల 18న ఖిలా వరంగల్‌‌‌‌లోని వాకింగ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో జరగనున్న అమిత్‌‌‌‌షా విజయ సంకల్ప యాత్రను సక్సెస్‌‌‌‌ చేయాలని బీజేపీ వరంగల్‌‌‌‌ తూర్పు క్యాండిడేట్‌‌‌‌ ప్రదీప్‌‌‌‌రావు పిలుపునిచ్చారు. ఓ సిటీలోని క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం జరుగుతోందని, అధికారం మారాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌లు రెండు, మూడు స్థానాల కోసమే పోటీ పడుతున్నట్లు చెప్పారు. కుటుంబ, ఓటు బ్యాంకు రాజకీయాలను తిరస్కరించి, దేశ భద్రత, సంస్కృతిని కాపాడుతున్న బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. డబుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌ సర్కార్‌‌‌‌తోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో, పథకాల్లో కేంద్రం వాటా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.