
చదువు ముఖ్యమే అయినా దానితోపాటు ఆటలు కరాటే కూడా స్వీయరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఆయన తెలిపారు. ప్రగతి నగర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు జరిగిన 5 నుంచి 14 సంవత్సరాల 50 మంది విద్యార్థులు 'ఒక్క నిమిషంలో 300 పంచులు' పేరుతో వరల్డ్ జీనియస్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వమే అన్నీ చేయాలనుకోకూడదని, మనం కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిరంతరం కాపలా కాయడం వల్లనే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలన్నారు. ఆటల్లో కళల్లో కులం మతం ప్రాంతం వంటి భేద భావాలు ఉండకూడదన్నారు. రికార్డు సాధించిన విద్యార్థులకు ఆయన అవార్డులు ప్రధానం చేశారు. ఈ ఈవెంట్ ను కరాటే ట్రైనర్ గీత పర్యవేక్షించారు.