
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే... బుధవారం ( జులై 30 ) ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ ను సుమారు ఐదు గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు ఈడీ. ఈ విచారణలో ప్రకాష్ రాజ్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు ప్రకాష్ రాజ్. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేయనని అన్నారు.
బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరు డబ్బు సంపాదించాలని భావించవద్దని.. ఈడి అధికారులు తాను చెప్పిన విషయాలు నమోదు చేసుకున్నారని.. మళ్ళీ విచారణకు పిలవలేదని అన్నారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉండగా.. దుబాయ్ కి చెందిన బెట్టింగ్ యాప్ కంపెనీల నుంచి భారీగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు అధికారులు. ప్రకాష్ రాజ్ సహా చాలామంది సెలెబ్రిటీలు దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేసినట్లు గుర్తించారు అధికారులు.
Also read:-ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరు.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పై విచారణ
చాలా మంది సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్ లోనే పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో గత ఐదేళ్ల కాలంలో ప్రకాష్ రాజ్ కి సంబందించిన లావాదేవిలను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. తన బ్యాంకు స్టేట్మెంట్ లను ఈడీకి అందజేశారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ జంగిల్ రమ్మీ ద్వారా భారీగా లాభపడినట్లు గుర్తించింది ఈడీ. గతంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేశానని.. జుంగ్ రమ్మీతో కాంట్రాక్టు పూర్తయ్యాక మళ్ళీ రెన్యువల్ చేయలేదని అన్నారు ప్రకాష్ రాజ్.