‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇదే

‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇదే

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న సభ్యుల వివరాలను విడుదల చేశారు. మొత్తం 27 మంది సభ్యులతో జాబితాను మీడియాకు విడుదల చేశారు. మా ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ అందరికంటే ముందుగా ప్రకాష్ రాజ్ ప్రకటించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. ప్రకాష్ రాజ్ కు నాగబాబు కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలో మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు నేను సైతం అంటూ బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ ముఖాముఖి తలపడతారేమోనని భావిస్తున్న తరుణంలో నేను సైతం అంటూ జీవిత పేరు తెరపైకి రాగా.. తాజాగా నటి హేమ కూడా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో మా అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. పదవుల కోసం కాదు.. పనిచేసి చూపించడం కోసం ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ మీడియాకు విడుదల చేసిన ఆయన సభ్యుల ప్యానెల్ యధాతథంగా...
ప్రకాష్ రాజ్  సిని'మా' బిడ్డల ప్యానెల్
 సిని'మా' బిడ్డ‌లం
మ‌న‌కోసం మ‌నం
'మా' కోసం మ‌నం
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) ఎన్నికలను పుర‌స్క‌రించుకుని, 'మా' శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. 'మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం.
ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్ 
సిని 'మా' బిడ్డ‌లు
1. ప్ర‌కాష్‌రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17.  ఉత్తేజ్  
18. బండ్ల గణేష్  
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జాడన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు
& మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో...
నమస్సులతో 
మీ 
ప్రకాష్ రాజ్.