డబ్బు కోసం చెత్త సినిమాలు.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

డబ్బు కోసం చెత్త సినిమాలు.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

ప్రకాశ్‌ రాజ్‌(Prakash raj).. సినీ లవర్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్ ను ఆకట్టుకోగల సమర్థులు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన అద్భుతమైన నటనతో లక్షల మంది అభిమానులను సంపాదించకున్నాడు  ఈ నటుడు. కేవలం సినిమాలే కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ప్రకాష్ రాజ్. తన చుట్టూ జరిగే విషయాల గురించి కూడా స్పందిస్తూ ఉంటాడు. 

ఇదిలా ఉంటే.. తాజాగా తన సినీ జీవితం గురించి, తాను చేసిన సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. కథ, పత్రాలు బాలేకపోయినా కొన్ని సార్లు డబ్బు కోసం నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నా సినీ జీవితంలో ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశాను. చాలా మంది నన్ను రిజెక్ట్‌ కూడా చేశారు. దానివల్ల నేను పెద్దగా బాధపడలేదు. ఎందుకంటీయే.. నాకు ఎందుకు నో చెప్పి ఉంటారు, దాని వెనుకాల జరిగిన రాజకీయల గురించి నేను ఊహించగలను.

కొన్ని సార్లు కేవలం డబ్బు కోసం పిచ్చి సినిమాలు చేశాను. కొంతమంది సినిమాలో ఎందుకంత ఓవరాక్టింగ్‌ చేస్తావని మొహం మీదే చెప్పేస్తారు. వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే.. నేను ఓవరాక్టింగ్‌ చేస్తున్నానంటే దానర్థం నాకు యాక్టింగ్ వచ్చినట్లే కదా! కొన్నిసార్లు పైసా తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలు ఆడినప్పుడు వచ్చే ఆనందం డబ్బుతో వెలకట్టలేనిది. ఇది నా జీవితం.. నాకు నచ్చినట్లు జీవిస్తాను.. అని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.