గోవా సీఎంగా రేపు ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

గోవా సీఎంగా రేపు ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. దీంతో గోవాకు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 7వ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డ్ సృష్టించనున్నారు. అంతకు ముందు 2019లో ఆయన మొదటిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల 40 స్థానాలు గల గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని బీజేపీ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తక్కువపడింది. అయితే.. ఎంజీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్ధతు పలికారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజీపీకి మార్గం సుగమమైంది.

ఇవి కూడా చదవండి..

సింగరేణిలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?

స్విస్ ఓపెన్ టైటిల్ పీవీ సింధు కైవసం