
జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. ఇండోనేసియా ఓపెన్‌లో మరోసారి సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ 16–21, 15–21తో జున్ పెంగ్ (చైనా) చేతిలో ఓడాడు. 40 నిమిషాల మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్ షటిల్‌పై కంట్రోల్ చూపెట్టలేకపోయాడు. షాట్స్‌లో రిథమ్ లేకపోవడం, ర్యాలీలు ఆడటంలో ఇబ్బంది పడిన ప్రణయ్ తొలి గేమ్‌లో 6–11తో వెనుకబడ్డాడు. ఈ దశలో అనవసర తప్పిదాలతోపాటు నెట్ వద్ద తేలిపోయి తొలి గేమ్ చేజార్చుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో 7–7 స్కోరు తర్వాత ప్రణయ్ పుంజుకోలేకపోయాడు. జున్ పెంగ్ స్పష్టమైన ఆధిక్యంతో గేమ్, మ్యాచ్‌ను ముగించాడు.