ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌, సమీర్‌‌‌‌‌‌‌‌

ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌, సమీర్‌‌‌‌‌‌‌‌

సిడ్నీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌, సమీర్‌‌‌‌‌‌‌‌ వర్మ.. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 21–17, 21–15తో మిషా జిల్బెర్మన్‌‌‌‌‌‌‌‌ (ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌)ను ఈజీగా ఓడించగా, సమీర్‌‌‌‌‌‌‌‌ 21–14, 14–21, 21–19తో ఎనిమిదో సీడ్‌‌‌‌‌‌‌‌ లోహ్‌‌‌‌‌‌‌‌ కీన్‌‌‌‌‌‌‌‌ యు (సింగపూర్‌‌‌‌‌‌‌‌)పై పోరాడి నెగ్గాడు. 46 నిమిషాల మ్యాచ్​లో ప్రణయ్​ బలమైన క్రాస్​ కోర్టు విన్నర్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ 20–22, 6–21తో ఏడోసీడ్‌‌‌‌‌‌‌‌ కెంటా నిషిమోటో (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌ 21–16, 21–13తో కాయ్‌‌‌‌‌‌‌‌ క్వి బెర్నిస్‌‌‌‌‌‌‌‌ టోహ్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి ముందంజ వేసింది. 

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అనుపమ ఉపాధ్యాయ 11–28, 18–21తో పుత్రి కుసుమ వార్దాని (ఇండోనేసియా) చేతిలో, మల్వికా బన్సోద్‌‌‌‌‌‌‌‌ 17–21, 21–23తో -ఈస్టర్‌‌‌‌‌‌‌‌ నురుమి టై వార్డోయ్‌‌‌‌‌‌‌‌ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సుమీత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి–సిక్కి రెడ్డి 21–11, 21–11తో కాయ్‌‌‌‌‌‌‌‌ చెన్‌‌‌‌‌‌‌‌ టోహ్‌‌‌‌‌‌‌‌–కాయ్‌‌‌‌‌‌‌‌ క్వి బెర్నిసి (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో రుతపర్ణ–శ్వేతపర్ణ 5–21, 9–21తో పీ జింగ్‌‌‌‌‌‌‌‌ లాయ్‌‌‌‌‌‌‌‌–చివు సీయెన్‌‌‌‌‌‌‌‌ లిమ్‌‌‌‌‌‌‌‌ (మలేసియా) చేతిలో ఓడారు.