18 వందల డాక్యుమెంట్లు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు

18 వందల డాక్యుమెంట్లు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్వినియోగం గుట్టురట్టైంది. ప్రతిపక్ష నేతలు, కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అనుమానం ఉన్న అధికారుల ఫోన్ల ట్యాపింగ్‌‌‌‌ రహస్యం బయటపడింది. స్పెషల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఐబీ) కేంద్రంగా నడిచిన సీక్రెట్‌‌‌‌ ఇల్లీగల్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ను కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నది. 

సీడీఆర్‌‌‌‌(కాల్‌‌‌‌ డీటెయిల్‌‌‌‌ రికార్డు)లు, ఐఈఎంఐ, ఐపీడీఆర్‌‌‌‌ (ఇంటర్నెట్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ డీటెయిల్‌‌‌‌ రికార్డు) డేటా, డెస్క్‌‌‌‌టాప్‌‌‌‌ల హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లను ప్రణీత్ ​రావు మార్చేశాడు. మొత్తం42 హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌లలో డేటాను తొలగించడంతో పాటు కొత్త హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లను వాటి స్థానంలో ఫిక్స్‌‌‌‌ చేశాడు. పాత హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌లు, కొన్ని డివైజ్‌‌‌‌లను ధ్వంసం చేశారు. ఇంటెలిజెన్స్‌‌‌‌ సేకరించిన సిమ్‌‌‌‌ కార్డులకు చెందిన ఐఎమ్ఈఐ నంబర్స్‌‌‌‌ పూర్తిగా ఎరైజ్ చేశారు. వీటిలో ఉండే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డేటాను తొలగించారు. 

తాము రికార్డ్ చేసిన కాల్ రికార్డ్స్ లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా దాదాపు 1800 డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకే ఆధారాలను మాయం చేసినట్లు గుర్తించారు. ప్రణీత్‌‌‌‌రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొంత మంది ఇంటెలిజెన్స్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.