దేశ రాజకీయాలపై పీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దేశ రాజకీయాలపై పీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • విపక్షాల సారథిగా విశ్వసనీయమైన వ్యక్తి ఉంటే గెలవొచ్చు
  • అన్ని పార్టీల్ని ఏకం చేయగల..అందరికీ ఆమోదయోగ్యుడైన నేత  ప్రధాని అభ్యర్థిగా సరైన వ్యక్తి
  • ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా.. ప్రతిపక్ష నాయకులు భేటీలు  నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్,  బిహార్ సీఎం నీతీశ్ కుమార్,  బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ.. ఇతర విపక్ష నేతలతో  ఇటీవల వరుస  భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రతిపక్షాల నేతల వరుస భేటీలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇంట్రెస్టింగ్.. హాట్  కామెంట్స్ చేశారు. విపక్ష నేతలు వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదన్నారు.

అలాంటి సమావేశాల్ని..విపక్షాల ఐక్యతగా లేదా రాజకీయ పరిణామంగా చూడరాదు అని పేర్కొన్నారు. విపక్షాల కూటమి  సారథిగా విశ్వసనీయమైన  వ్యక్తి ఉంటేనే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో  గెలిచే అవకాశం ఉంటుందని  ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. విపక్షాల  ప్రయత్నాలు ఫలిస్తే  ప్రధాని  అభ్యర్థి  ఎవరనే చర్చ జరుగుతుంది. మమత,  కేజ్రీవాల్, కేసీఆర్లలో ఎవరు బెటర్ అని అడగ్గా..  అన్ని పార్టీల్ని ఏకం  చేయగల, అందరికీ  ఆమోదయోగ్యమైన నాయకుడే.. ప్రధాని అభ్యర్థిగా సరైన వ్యక్తి  అని ప్రశాంత్ కిశోర్ జవాబు ఇచ్చారు.