Hanuman Movie: పరాయి దేశంలో హనుమాన్ దూకుడు..టాప్ మూవీగా రికార్డు

Hanuman Movie: పరాయి దేశంలో హనుమాన్ దూకుడు..టాప్ మూవీగా రికార్డు

ప్రస్తుతం ఇండియన్ సినీ థియేటర్స్ అన్ని జై హనుమాన్ (Jai HanuMan) నినాదాలతో ఊగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన హనుమాన్ (Hanuman) అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాను చూడటానికి ఎగబడుతున్నారు ఆడియన్స్.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 22 కోట్ల పైగా గ్రాస్ని సొంతం చేసుకుంది. సెకండ్ డే కలెక్షన్స్కి వస్తే రూ.15 కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..హనుమాన్ మూవీకి యూఎస్‌లో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఓవర్సీస్లో  హనుమాన్ ఏకంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ని సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కంటే ముందుగానే హనుమాన్ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం విశేషం అంటూ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. హనుమాన్ ఫస్ట్ డే ఓవర్సీస్ లోని కలెక్షన్స్..యూఎస్‌లో F2 పేరిట ఉన్న 395K రికార్డును బ్రేక్ చేసింది.

రానున్న రోజుల్లో హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు.