కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో రాజకీయ స్థిరత్వం

కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో రాజకీయ స్థిరత్వం

బిహార్లో గత పదేళ్లుగా రాజకీయ అనిశ్చితి ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. నితీశ్ కుమార్ కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో రాజకీయ స్థిరత్వం తిరిగి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బిహార్లో జేడీయూ, ఆర్జేడీ కూటమి ప్రాధాన్యత ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుండా లేదా అనేది చూడాలన్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో.. తేజస్వి యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తాడన్నారు. ప్రస్తుత పరిస్థితులు బిహార్ కే పరిమితమని.... ఇవి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయని అనుకోవట్లేదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.