అందుకే నా సినిమాలు డార్క్గా ఉంటాయి.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్

అందుకే నా సినిమాలు డార్క్గా ఉంటాయి.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్

ప్రశాంత్ నీల్(Prashanth neel).. ఇప్పుడు ఇది పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. పోస్టర్ పై ఈ పేరు కనిపించింది అంటే చాలు.. ఆ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడతారు, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. అది పేరుకున్న పవర్. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఇప్పటికే ఆ విషయాన్ని ప్రూవ్ చేశాయి. మరోసారి ప్రూవ్ చేయడానికి సలార్ సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. 

రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందులో భాగంగా తన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. నిజానికి ప్రశాంత్ నీల్ సినిమాలు డార్క్ మోడ్ లో ఉంటాయి. స్క్రీన్ మొత్తం నల్లగా మసిపట్టినట్టుగా ఉంటుంది. ఉగ్రం, కేజీఎఫ్, కేజీఎఫ్2 చిత్రాలు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇక లేటెస్ట్ గా వస్తున్న సలార్ కూడా అదే బ్యాక్డ్రాప్ లో రానుంది. అందుకే ఆడియన్స్ కు కూడా ఆ ప్రశ్న మిగిలిపోయింది. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్నీ ప్రశాంత్ నీల్ వద్ద ప్రస్తావించగా.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ప్రశాంత్. 

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. నాకు చాలా కాలంగా OCD (Obsessive compulsive disorder) సమస్య ఉంది. ఏదైనా కలర్ ఫుల్ గా ఉంటే నాకు నచ్చదు. నా పర్సనల్ థాట్స్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే నా సినిమాలన్నీ డార్క్ మోడ్ లో ఉంటాయి. అలా ఉండటం వల్ల నా సినిమాలి ఒకదానికొకటి లింక్ ఉందని అనుకుంటున్నారు కానీ.. అలాంటిదేమి లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.