Hanuman Exclusive Review: హనుమంతుని బలానికి ఆడియన్స్ ఫిదా

Hanuman Exclusive Review:  హనుమంతుని బలానికి ఆడియన్స్ ఫిదా

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ (HanuMan). కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12న) రిలీజ్ కాబోతుంది. అంటే హనుమాన్ మూవీ మరికొన్నిగంటల్లో సింగిల్, మల్టీప్లెక్స్ థియేటర్లోకి రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షోలు ముందుగానే, తెలుగు రాష్ట్రాల్లో జనవరి 11న సాయంత్రం 6 గంటల నుంచి స్పెషల్ షోస్ పడ్డాయి. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కు..పెద్ద రేంజ్ లో టాక్ వచ్చింది. ఇంతకు ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? తెలియాలంటే రివ్యూలో చూద్దాం.   

కథేంటి: 

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే..అంజనాద్రిలో ఉంటున్న హనుమంతు (తేజ)తనకి తాను సూపర్‌ హీరోగా ఊహించుకోవడం మొదలు పెడతాడు. సూపర్ హీరో అంటే ఏమిటో..అలా వచ్చే బలాలు ఏంటో అనేది తెలియదు. అపుడు ఆ హనుమంతునికి తన తల్లి హనుమంతుడి బలం గురుంచి వివరిస్తోంది. అలా సినిమా డీసెంట్ గా..కామెడీ, ఊర్లో జనాల మధ్య సరదా సన్నివేశాలతో సాగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ కు రోమాలు నిక్క పొడుచుకునేలా ఉంటోంది. హీరో తేజ సజ్జ సూపర్ పవర్స్ అందుకున్న మూమెంట్ నుండి సినిమా హై లెవల్ లో నడుస్తోంది. అపుడొచ్చే ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఫస్టాఫ్ లో టైటిల్ కార్డు పడే సీన్ గురించి మాట్లాడుకునేలా ఉంది. 

సెకండాఫ్ విషయానికి వస్తే..హీరో తేజ హనుమంతుడి సూపర్ పవర్స్ ఎలా సాధించాడో తెలుసుకోవడానికి విలన్ పాత్రలో నటించిన వినయ్ రాయ్ చాలా రకాలుగా  ప్రయత్నిస్తుంటాడు. అలా చివరికి హనుమాన్ శక్తులను తేజ ఎలా సంపాదించాడో వినయ్ రాయ్ తెలుసుకుంటాడు. ఇక ఆ తర్వాత రాముడు మరియు హనుమంతుని మధ్య వచ్చే ఎలివేషన్ సీన్స్ ఆడియన్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేలా ఉంది. హనుమాన్ ఎంట్రీ ఇచ్చే సీన్స్ లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌తో హనుమాన్ బలం ఎంతలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా ఉంటోంది. హనుమాన్ మనుషుల మధ్య మెదిలే డ్రామా, వారిలో కలిగే ఎమోషన్స్, సినిమా ప్రతి ఫ్రేమ్లో వీఎఫ్ఎక్స్ వర్క్, హనుమాన్ ను చూపే మైథాలజీని ఆయన సమపాళ్లలో అద్భుతంగా చూపించారు ప్రశాంత్ వర్మ .

ఎవరెలా చేశారంటే:

హీరో తేజ సజ్జ తన అమాయకమైన..బలహీనత పాత్రలో బాగా నటించారు. ఇక ఆ తర్వాత హనుమంతుడి బలం తోడయ్యాక అతని నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపొయ్యేలా ఉంది. ఇన్నాళ్లు చిన్న హీరోగా ఉన్న తేజ..ఇకపై బిగ్ స్టార్ గా మారడం కన్ఫమ్ అనేలా నటనని కనబరిచాడు. ఎమోషన్స్ సీన్స్ లో తేజ నటన నెవెర్ బిఫోర్ అనేలా ఉంది. అమృత అయ్యర్ తన పాత్రలో ఒదిగిపోయింది.వర్సటైల్ యాక్టర్స్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తనదైన  మార్క్ చూపించారు. విలన్ పాత్రలో నటించిన వినయ్ రాయ్ నటన బాగుంది. మరో వర్సటైల్ యాక్టర్ సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్ వెన్నెల కిశోర్ పోషించిన పాత్ర ఇంకాసేపు ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. సత్య, గెటప్ శ్రీను మరోసారి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. హనుమంతుని గొప్పతనాన్ని వివరించే అద్భుతమైన సన్నివేశలతో గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

టెక్నీకల్ విషయానికి వస్తే:

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన కథలో ఎమోషన్స్ చూపిస్తూనే..తనలోని క్రియేటివిటీ ని చూపించాడు. నటి నటుల నుండి నటనని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. హనుమాన్ కథలో వీఎఫ్ఎక్స్ పాత్ర చాలా అత్యద్భుతంగా ఉంది. హనుమాన్ సినిమా మొత్తానికి కీలక పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. కథకు మరింత అదనపు బలాన్ని వీఎఫ్ఎక్స్ ద్వారా డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్తలు మెచ్చుకోవాలి.

గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం.సినిమాటోగ్రఫీ శివేంద్ర తన పనితీరును ప్రతి ఫ్రేమ్ లో కనబరిచాడు. సినిమాను హై రేంజ్ లో చూపించడంలో..ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పించడంలో శివేంద్ర సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ ఎస్.బి. రాజు తలారి పనితనం బాగుంది. సినిమాను ఎక్కడ ల్యాగ్ అనే ఫీలింగ్ కలగకుండా చేశాడు. సాంకేతికంగా హనుమాన్ సినిమా మరో లెవెల్ లో ఉంది. నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి హనుమాన్ సినిమా కోసం ఏం కావాలో..ఎలా తీసుకెళ్ళాడో ప్రతి ఫ్రేమ్ లో ఉన్న..ఆ రిచ్ నెస్ కనిపిస్తోంది.