ఆసియా షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ప్రతాప్‌‌‌‌ సింగ్‌‎కు గోల్డ్‌‌‌‌

ఆసియా షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ప్రతాప్‌‌‌‌ సింగ్‌‎కు గోల్డ్‌‌‌‌

షిమ్కెంట్ (కజకిస్తాన్): ఇండియా షూటర్‌‌‌‌ ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌ తొమర్‌‌‌‌.. ఆసియా షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌ 462.5 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. వెన్యూ జావో (చైనా, 462), నవోయా ఒకాడా (జపాన్‌‌‌‌, 445.8) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. చైన్‌‌‌‌ సింగ్‌‌‌‌, అకిల్‌‌‌‌ షెరోన్‌‌‌‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. 

50 మీటర్ల రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్స్‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ప్రతాప్‌‌‌‌–చైన్‌‌‌‌ సింగ్‌‌‌‌–అకిల్‌‌‌‌ షెరోన్‌‌‌‌ త్రయం 1747 పాయింట్లతో రజత పతకాన్ని సాధించింది. ఇక చైన్‌‌‌‌ సింగ్‌‌‌‌ 582, షెరోన్‌‌‌‌ 581 పాయింట్లు నెగ్గారు. విమెన్స్‌‌‌‌ 25 మీటర్ల ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ క్వాలిఫికేషన్స్‌‌‌‌లో ఇషా సింగ్‌‌‌‌, మను భాకర్‌‌‌‌ వరుసగా రెండు, నాలుగో ప్లేస్‌‌‌‌లో నిలిచారు. జూనియర్‌‌‌‌ మెన్స్‌‌‌‌ 3 పొజిషన్స్‌‌‌‌ లో వేదాంత్‌‌‌‌  వాగ్‌‌‌‌మారె (582)–ఆడ్రియన్‌‌‌‌ (576)–రోహిత్‌‌‌‌ కనయన్‌‌‌‌  (575) బృందం 1733 పాయింట్లతో స్వర్ణం పతకం గెలుచుకుంది.