భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్​కు ప్రవల్లిక పేరెంట్స్​..

భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్​కు ప్రవల్లిక పేరెంట్స్​..

హైదరాబాద్​ : వరంగల్​కు చెందిన విద్యార్థిని ప్రవల్లిక తల్లిదండ్రులను నర్సంపేట పోలీసులు ప్రగతిభవన్​ కు తీసుకెళ్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్​ కు తీసుకొస్తున్నారు. ప్రవల్లిక పేరెంట్స్ తో సీఎం కేసీఆర్ పర్సనల్ గా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రవల్లిక పేరెంట్స్ ను పోలీసులు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్టోబర్​ 13వ తేదీ శుక్రవారం రోజు వరంగల్​ కు చెందిన మర్రి ప్రవల్లిక చిక్కడపల్లిలోని బృందావన్ గర్ల్స్ హాస్టల్​ లో ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా అశోక్​ నగర్ లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోంది. ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలియగానే నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు చిక్కడపల్లికి చేరుకుని ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. 


రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్​ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తెలెత్తాయి. ప్రవల్లిక మృతిపై పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్పందించారు. కేసీఆర్ సర్కారే ప్రవల్లిక మృతికి కారణమంటూ ఆరోపించారు. 

మరోవైపు.. ప్రవల్లిక మృతికేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో చిక్కడపల్లి సీఐ పిడమర్తి నరేశ్​ను సస్పెండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో చిక్కడపల్లి సీఐ నరేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఆదివారం (అక్టోబర్​ 15) ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు.