ప్రవీణ్ నెట్టారు హత్య కేసు నిందితులపై రివార్డు

ప్రవీణ్ నెట్టారు హత్య కేసు నిందితులపై రివార్డు

బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ సభ్యులపై ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. వారిలో ఎవరిని పట్టించినా రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని చెప్పింది. కర్ణాటకకు చెందిన కడజే మహమ్మద్ షరీఫ్, మసూద్ కెఏల సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ స్పష్టం చేసింది. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని info.blr.nia ద్వారా పంపవచ్చని చెప్పింది. మరింత సమాచారం కోసం uw gov.in లేదా 080 - 29510900, 8904241100 ను సంప్రదించవచ్చని సూచించింది.

ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 10మందికి పైగా నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నలుగురిపై దర్యాప్తు సంస్థ ఇప్పటికే రివార్డును ప్రకటించింది. ఇదిలా ఉండగా.. జులై 26న కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. మంగళూరులోని పుత్తూరు - సుల్లియా రోడ్డులో ప్రవీణ్ నెట్టారును దారుణంగా నరికి చంపారు.