‘డిస్కో రాజా’ రవితేజకి పర్‌ ఫెక్ట్ టైటిల్!

‘డిస్కో రాజా’ రవితేజకి పర్‌ ఫెక్ట్ టైటిల్!

రవితేజ, పాయల్ రాజ్‌ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో వీఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సై ఫైథ్రిల్లర్ జనవరి 24న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘అందరికీ నచ్చే ఒక మంచి సినిమా వస్తోంది. ఈ సినిమా చేసేటప్పుడు నేనెంత ఎంజాయ్ చేశానో, చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. సినిమా అంత బాగా రావడానికి ముఖ్య కారకుడు డైరెక్టర్ ఆనంద్. మొదటిసారి బాబీ సింహాతో, రాంకీ గారితో పని చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. సునీల్ తో చాలా గ్యాప్ తర్వాత నటించడం ఆనందంగా ఉంది. మామూలుగా నాకు ఒక్కరు లేదా ఇద్దరు హీరోయిన్ లు ఉంటారు. మొదటిసారి ముగ్గురితో నటించాను. ముగ్గు రూ అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సినిమాకి ప్రాణం పోశారు. నన్ను చిన్నప్పటి నుంచి చూసి క్యారెక్టర్ తెచ్చినా ముందు పెట్టాడు ఆనంద్. అందుకే నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. దీనికి సీక్వెలో ప్రీక్వెలో రావడం ఖాయం’ అని చెప్పారు.

వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘ఈ సినిమా డైరెక్టర్ ఆనంద్ మొదటి సినిమాతోనే నన్ను ఆకట్టుకున్నాడు. రవితేజకి పర్ ఫెక్ట్​గా సూటయ్యే టైటిల్ పెట్టాడు. రామ్ తాళ్లూరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’ అన్నారు. ‘టీజర్, ట్రైలర్ లో రవితేజ యాటిట్యూడ్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమయ్యింది. రవితేజ కెరీర్‌‌‌ ‌‌‌లో ఇదొక మంచి చిత్రంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు అనిల్ రావిపూడి. డైరెక్టర్ బాబి మాట్లాడుతూ ‘ఒక రైటర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న నన్ను నమ్మి డైరెక్టర్ ని చేసిన రవితేజకి నా కుటుంబమంతా రుణపడి ఉంటుంది. ఈ సినిమా పాటలు తమన్ దగ్గర దొంగతనంగా విన్నాను. టీజర్‌‌‌‌‌‌‌‌ కూడా ముందే చూసేసి ఆగలేక రవిగారికి కాల్ చేశాను. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు వేరు. ఈ సినిమాలో మాస్ మహరాజా వేరు. ఇంత కాన్ఫిడెంట్​గా చెబుతున్నానంటే మీరే అర్థం చేసుకోండి’ అన్నారు.

‘ఈ సినిమా విషయంలో చాలా ఎక్సయిటెడ్‌‌‌‌గా ఉన్నాను. మీ అందరికీ తప్పక నచ్చుతుంది’ అంది పాయల్ రాజ్​పుత్. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు నభా నటేష్, తాన్యా హోప్. టైటిల్‌‌‌‌తోనే సినిమా సక్సెస్ అయిపోయినట్టేనని, రవితేజకి యాప్ట్ టై టిల్ అని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ‘టైగర్ మూవీ రిలీజయ్యాక మొదటి ఫోన్ రవితేజ గారి నుంచి వచ్చింది. నేనెవరో తెలియకుండానే ఫోన్ చేసి మెచ్చుకున్నారు. డిస్కో రాజా చేయడానికి ముఖ్య కారణం ఆయనే. ఆయన ఎనర్జీయే వేరు. ప్రతి దర్శకుడూ ఆయనతో ఒక మూవీ కచ్చితంగా చేయాలి. ఆయన నుంచి చాలా నేర్చు కోవచ్చు. సినిమా గురించే కాదు, జీవితం గురించి కూడా’ అన్నారు.

see also: పిల్లలు బెట్టింగ్ ఉచ్చులో చిక్కితే ఇలా కనిపెట్టొచ్చు

మైనర్​పై అత్యాచారం : యువకుడికి దేహశుద్ధి

కల్మషం లేని మనసులు: చిన్న వయసులో పెద్ద ఆలోచన