గర్భిణులకు ట్రీట్‌మెంట్‌ కష్టాలు

గర్భిణులకు ట్రీట్‌మెంట్‌ కష్టాలు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని మెటర్నిటీ హాస్పిటల్స్ కోవిడ్ సెంటర్స్ గా మారడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రీట్మెంట్ కోసం జిల్లాల నుంచి కూడా వస్తుండడంతో మిగతా హాస్పిటల్స్పై ఒత్తిడి పెరుగుతోంది. పేట్లబురుజు, గాంధీ, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్స్ తోపాటు మలక్ పేట్, కొండాపూర్, సూరజ్ భాను ఏరియా ఆస్పత్రులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గర్భిణులు వచ్చి చెకప్ చేయించుకుంటారు. కరోనా పరిస్థితుల్లో గాంధీ, కింగ్ కోఠి హాస్పిటల్స్ను ప్రభుత్వం కోవిడ్‌ సెంటర్లుగా మార్చింది. వైరస్‌ భయంతో పేట్ల బురుజు హాస్పిటల్ లో కొద్దిమందికే చూస్తున్నారు.

ఆ రెండు హాస్పిటల్స్ కు ఎక్కువగా..
సుల్తాన్ బజార్, నిలోఫర్ మెటర్నీటి హాస్పిటల్స్ కు ఎక్కువగా వెళ్తున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి గత నెల 15 వరకు ఒక్క సుల్తాన్ బజార్ హాస్పిటల్‌లోనే 4,586 డెలివరీలు చేశారు. ఈ రెండు హాస్పిటల్స్ లో డైలీ 400 దాకా ఓపీ ఉంటోంది. 80 కి పైగా డెలివరీలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో దూర ప్రాంతాల వారు ప్రతి నెల సిటీకి వచ్చి చూపించుకోవడం కంటే దగ్గర్లోని హాస్పిటల్స్కు వెళ్లడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. 8 నెలలు నిండే వరకు ఎమర్జెన్సీ ఉంటేనే రావాలని చెప్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా వస్తుండడంతో మెటర్నిటీ హాస్పిటల్స్పై ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. పైగా, వారి వెంట ముగ్గురు, నలుగురు కుటుంబ సభ్యులు వస్తున్నారని చెప్తున్నారు.

కరోనా టెస్టుల్లేవ్
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం డెలివరీకి ముందు కోవిడ్ టెస్టులు చేయాలి. కానీ సిటీలోని మెటర్నిటీ హాస్పిటల్స్ లో ఈ ఫెసిలిటీ లేదు. ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా అలా చేయలేదు. ఎమర్జెన్సీ తో వచ్చే గర్భిణులకు టెస్ట్ కంటే ముందు డెలివరీ చేస్తున్నామని, ఆ తర్వాత ఏమైనా సింటమ్స్ ఉంటే కోవిడ్ హాస్పిటల్స్ కి రెఫర్ చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారు.

ఆదిలాబాద్ నుంచీ వస్తున్నరు
ఓపీకి గర్భిణులతోపాటు వారి వెంట కుటుంబ సభ్యులుఎక్కువగా వస్తున్నారు. ఇన్ పేషెంట్‌గా 80 మంది దాకా అడ్మిట్ అవుతుండగా డెలివరీ చేసి 4 రోజుల్లో ఇంటికి పంపిస్తున్నాం. ఎమర్జెన్సీ అయితే కార్డ్ లేకున్నా అడ్మిట్ చేసుకుంటున్నాం. కోవిడ్ టెస్ట్కి సరైన సదుపాయాల్లేవు. సింప్టమ్స్ ఉంటే కోవిడ్ హాస్పిటల్స్కి రెఫర్ చేస్తున్నాం. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచీ పేషెంట్స్‌ వస్తున్నారు.

రాజ్యలక్ష్మి, సూపరింటెండెంట్,
సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్

For More News..

‘యాంటీజెన్’ లెక్కలేవీ..

మూడు బల్బులు, ఒక్క టీవీ.. కరెంటు బిల్లు రూ. 1.66 లక్షలు

పోలికలే కాదు.. మార్కుల్లోనూ ట్విన్స్

పురిటి నొప్పులతో.. వాగులో నడుస్తూ..