తల్లి కాబోతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

తల్లి కాబోతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గరన్నుంచి మహిళలు  ప్రతీ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

కడుపులోని బిడ్డ మానసిక ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి.

కడుపులోని బిడ్డకి ఐదోనెల నుంచే వినికిడి శక్తి  మొదలవుతుంది. అందువల్ల పేరెంట్స్ ఏ మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి.

చెడు మాటలు, అరుపులు, తగువుల లాంటివేమి బిడ్డ చెవిన పడకుండా చూడాలి.

ముఖ్యంగా కాబోయే తల్లి పెద్దగా అరవడం, తిట్టడం లాంటివి చేయకూడదు.

ప్రెగ్నెన్సీ టైంలో ఒత్తిడికి గురవడం  మామూలే.  కానీ ఆ ఒత్తిడి ఎక్కువ రోజులు కొనసాగితే బిడ్డ ఆరోగ్యానికి  మంచిది కాదు.

కాబోయే తల్లి ఒత్తిడికి గురైతే బేబీ నెలలు నిండకుండానే పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్​.

అంతేకాదు పిల్లలు పుట్టినప్పుడు ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు.

అందువల్ల ఒత్తిడి నుంచి  బయటపడటానికి కాబోయే తల్లి ఏదో ఒక పనిలో బిజీ అవ్వాలి.

అలాగే చాలామంది  ప్రెగ్నెన్నీ టైంలో బిడ్డ ఆరోగ్యం కోసం  మందులు వేసుకుంటారు.

అయితే బిడ్డ ఎదుగుదల సరిగా ఉండడానికి మందులతో పాటు ధ్యానం చేయడం​  కూడా ముఖ్యం.

ధ్యానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి కూడా దరిచేరదు.

అలాగే ప్రెగ్నెన్సీ టైంలో   కనీసం 10 గంటల  నిద్ర కంపల్సరీ.