రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మమిత బైజు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో మమిత బైజుతో పాటు నస్లేన్, సంగీత్ ప్రతాప్ లీడ్ రోల్స్ చేశారు. గిరీష్ ఏ.డీ దర్శకుడు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో మెప్పించిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు.
అయితే షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని అనుకున్నారంతా. టెక్నికల్ ఇష్యూస్‌తో లేట్ అవుతోందని నిర్మాతల్లో ఒకరైన దిలీష్ పోతన్ కూడా చెప్పారు. కానీ అసలు విషయాన్ని ఇప్పుడు హీరో నస్లేన్ రివీల్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్‌లో తలెత్తిన సమస్యలు కారణంగా ‘ప్రేమలు 2’ను పక్కన పెట్టేసినట్టు చెప్పాడు.
సీక్వెల్‌పై ఉన్న అంచనాలను అందుకునే స్థాయిలో స్క్రిప్ట్ కుదరకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. ఇక ‘ప్రేమలు’ తర్వాత రెబల్, డ్యూడ్, కర లాంటి తమిళ చిత్రాలతో ఆకట్టుకున్న మమిత.. త్వరలో సూర్యకు జంటగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
