ప్రేమేందర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : బండి సంజయ్

ప్రేమేందర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : బండి సంజయ్
  •     బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

​నల్గొండ అర్బన్​, వెలుగు : చంపుతామని బెదిరించినా జెండా వదలని ధైర్యవంతుడు ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ కోరారు. శనివారం పట్టణంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులందరూ ముగ్గురు అభ్యర్థులను బేరిజు వేసుకుని ప్రజల కోసం పనిచేసే ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలన్నారు. కోట్లాడేతత్వం, ప్రశ్నించే ధైర్యం ఉన్న నాయకుడు ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అని అన్నారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో కోట్లాడేది బీజేపీనే అని, మండలిలో ముస్లిం రిజర్వేషన్లు బిల్లు అడ్డుకోవాలంటే బీజేపీ అభ్యర్థి గెలువాలన్నారు. 80 శాతం మంది హిందువులు కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు గుణపాఠం చెప్పాలన్నారు. ధాన్యానికి 500 బోనస్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మీద కోపంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించారని తెలిపారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని ఎక్కడా చెప్పలేదని, గాడిద గుడ్డు పట్టుకుని తిరిగాడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్వనాశనం అయిందన్నారు.

సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, సీనియర్‌‌‌‌‌‌‌‌ నేతలు రచనారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్ధి శానంపుడి సైదిరెడ్డి, నాయకులు గోలి మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నూకల నరసింహారెడ్డి, పిల్లి రామరాజు, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.