
- ఇండియన్ జెనోమిక్స్ కంపెనీపై కేసు
హైదరాబాద్: చర్లపల్లిలోని ఇండియన్ జెనోమిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇంజక్షన్లు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు తీసుకున్నారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కీమోతెరఫీలో ఈ ఇంజక్షన్లు వాడుతున్నారని, వీటితో డీఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.