కోస్గి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న కోస్గి పర్యటించనుండగా, శనివారం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట ఇన్ చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల కొత్త సర్పంచులను సీఎం సన్మానించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్లు ఆదేశించారు.
మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హెలికాప్టర్ లో కోస్గి చేరుకుంటారని తెలిపారు. సీఎంతో పాటు కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు అన్ని సౌలతులు కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీను, ఆర్డీవో రాంచందర్ నాయక్, వికారాబాద్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, డీఆర్డీవో మొగులప్ప, డీఎంహెచ్వో జయచంద్రమోహన్, డీఏవో జాన్ సుధాకర్, పీఆర్ ఈఈ హీర్యా నాయక్ పాల్గొన్నారు.
