ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు:  జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కోసం డేటా సిద్ధం చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా డీఎల్‌‌పీవో, ఎంపీడీవో, ఎంపీవోలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 54 జీపీల్లో చేపట్టిన పనుల వివరాలను ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని  సూచించారు.  ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, ఈ వివరాల ఆధారంగానే  కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వస్తారన్నారు.   ఆయా గ్రామాలలో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, 
 ఇందుకోసం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీఆర్‌‌‌‌డీవో నరసింహులు, డీపీవో సురేశ్, డీఎంహెచ్‌‌వో డాక్టర్ రవి శంకర్,  సివిల్ సప్లై ఆఫీసర్ కొండల్ రావు,  డీఏవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

తప్పులకు చోటివ్వొద్దు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆన్ లైన్‌‌లో వివరాలు అప్‌‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పులకు చోటివ్వొద్దని నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ అడిషనల్‌‌ కలెక్టర్ మనూ చౌదరి ఆదేశించారు.   బుధవారం కలెక్టరేట్‌‌లో డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవోలతో  జాతీయ పంచాయతీ అవార్డుల కార్యాచరణపై  సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలోని 461 జీపీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన డేటా ఎంట్రీ పనులు 31లోగా కంప్లీట్ చేయాలన్నారు. ఇప్పటికే నమోదు చేసిన వాటిలో  తప్పులు ఉన్నాయని, వాటిని సరి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీవో కృష్ణ, డీఆర్డీవో నర్సింగ్ రావు, జడ్పీ సీఈవో ఉష, డీఆర్డీఏ  అడిషనల్‌‌ పీడీ రాజేశ్వరి పాల్గొన్నారు. 

పీఆర్సీ–2023 కమిటీ వేయాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పీఆర్సీ కమిటీ వేయకుండా టీచర్స్, ఎంప్లాయీస్‌‌‌‌ను ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  బుధవారం డీసీసీ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ గత పీఆర్సీని ఆలస్యం చేయడంతోనే టీచర్స్, ఎంప్లాయీస్‌‌‌‌ సగటున రూ. 6 లక్షలు  నష్టపోయారని వాపోయారు. కేజీబీవీలో పని చేస్తున్న సీఆర్టీ, పీజీసీఆర్టీలు,  ఇతర ఎంప్లాయీస్‌‌‌‌కు  బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్సీ వర్తింపజేయాలని కోరారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా  పీఆర్సీ బకాయి రిటైర్డ్ అయ్యాక ఇస్తామనడం సరికాదన్నారు. మునుగోడు బై ఎలక్షన్స్  తర్వాత  ముందస్తుకు పోతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని, దీన్ని సాకుగా చూపి పీఆర్సీ కమిటీని మరిత పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.  వెంటనే పీఆర్సీ కమిటీ వేసి.. 2023 జులై 1 నుంచి  ఫిట్ మెంట్ అమలుల్లో  వచ్చేలా చూడాలని కోరారు.   కాంగ్రెస్ తరఫున ఇప్పటికే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు బహిరంగ లేఖ రాశామని చెప్పారు. ఈ సమావేశంలో సెల్ కన్వీనర్ సీజే బెనహర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్10 లాస్ట్

గద్వాల, వెలుగు:  మహబూబ్‌‌నగర్‌‌‌‌, రంగారెడ్డి, హైదరాబాద్‌‌ టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నవంబర్ 10 లోగా ఓటర్ల రిజిస్ట్రేషన్‌‌ కంప్లీట్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లను ఎంఈవోల ద్వారా గుర్తించి ఫారం 19లో నమోదు చేయాలన్నారు. ఆ జాబితాను నవంబర్ 10 లోగా తహసీల్దార్లకు అందించాలని సూచించారు.  అనంతరం అన్ని పార్టీల లీడర్లతో మీటింగ్ నిర్వహించి.. పోలింగ్ స్టేషన్ల లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఇప్పటికే అన్ని సౌకర్యాలు కల్పించామని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి మూడు నెలలకోసారి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌‌లను పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, డీఈవో సిరాజుద్దీన్ పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

వనపర్తి, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలలో రాణించాలని నాగర్ కర్నూల్ ఎంపీ  రాములు సూచించారు. వనపర్తిలో ఈ నెల 17 నుంచి 19 వరకు నిర్వహించిన ఆరో జోనల్ స్థాయి క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి  జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందించి మాట్లాడారు.  వనపర్తిలో నిర్వహించిన జోనల్ స్థాయి  పోటీల్లో 13 టీమ్‌‌లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.  క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించి ముందుకు వెళ్లాలని సూచించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని,  పేదింట్లో పుట్టి ప్రపంచ మేధావిగా ఎదిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌‌‌‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  వనపర్తి చదువులకు పెట్టింది పేరని,  ఇక్కడి  పాలిటెక్నిక్ కాలేజీ మాజీ ప్రధాని నెహ్రూ ప్రారంభించారని గుర్తుచేశారు.  ఇటీవల  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  మెడికల్ , ఇంజనీరింగ్ , మత్స్య 
కాలేజీలను తీసుకొచ్చారన్నారు.  ఈ  కార్యక్రమంలో స్పోర్ట్స్ అధికారి రమేశ్ కుమార్,  స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రవికుమార్, కాలేజీ ప్రిన్సిపల్ గోవర్ధన్, మహబూబ్‌‌నగర్‌‌‌‌ ఆర్సీవో  నాగార్జున, రంగారెడ్డి ఆర్సీవో  కళ్యాణి, పీఈటీలు స్వాతి, యశోద, ఝాన్సీ రాణి పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో వివిధ గ్రాంట్ల కింద చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్‌‌ చేయాలని  కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌లో పీఆర్‌‌‌‌ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ పనులపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సీడీపీ గ్రాంట్ కింద  2021-–22 కు గాను రూ.30.25 కోట్లతో 842 పనులు చేపట్టగా 610 పనులు పూర్తయ్యాయన్నారు.  2022–-23కి  రూ.5.34 కోట్లతో 157 పనులు చేపట్టగా 64 పనులు కంప్లీట్ చేశామన్నారు.  82 పనులు  ప్రారంభం కాలేదని చెప్పారు. మనఊరు–మనబడి కింద రూ.70 కోట్లతో 205 పనులు చేపట్టగా 159 పనులు నిర్మాణదశలో ఉన్నాయని,   46  పనులు మొదలు కాలేదన్నారు.  రూర్బన్ స్కీమ్‌‌ కింద రూ.15 .12 కోట్లతో 153 పనులు చేపట్టగా.. 99 పనులు కంప్లీట్ అయ్యాయన్నారు.  23 పనులు  వివిధ దశల్లో ఉండగా.. 23 పనులు ప్రారంభం కాలేదన్నారు.  వివిధ గ్రామాల్లో రూ.15 కోట్లతో చేపట్టిన 50 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు.   2,672 డబుల్‌‌ బెడ్ రూమ్ ఇండ్ల  పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు.  పెండింగ్‌‌లో ఉన్న వెంటనే పూర్తి చేయాలని, లేదంటే  చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ దామోదర్ రావు, డిప్యూటీ ఈఈ దుర్గాప్రసాద్, వెల్ఫేర్ ఆఫీసర్‌‌‌‌ అనిల్ ప్రకాశ్ , డీఈ, ఏఈలు  పాల్గొన్నారు. 

చెత్త సేకరణ పన్ను రద్దు చేయాలి

పెబ్బేరు, వెలుగు : చెత్త సేకరణ పన్ను రద్దు చేయాలని పెబ్బేరులోని వర్తక, వ్యాపార సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ పన్నుకు సంబంధించి మున్సిపల్ అధికారులు నోటీసులివ్వగా..  బుధవారం పెబ్బేరు సుభాష్​ చౌరస్తా నుంచి  మున్సిపల్​ ఆఫీస్‌‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే  ఆస్తి, కరెంట్, గ్రీనరీ మొదలుకొని అనేక రకాలు పన్నులు కడుతున్నామని కొత్తగా చెత్తసేకరణ పన్ను ఏంటని మండిపడ్డారు.  ముందు రోడ్లకు ఇరువైపులా కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.  ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఆయనకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్​ కమిషనర్​ జాన్​ కృపాకర్‌‌‌‌కు  అందజేశారు.  ఈ కార్యక్రమంలో వర్తక, వ్యాపార సంఘం అధ్యక్షుడు యుగంధర్​రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ​ నేతలు విజయవర్ధన్​రెడ్డి, ప్రకాశ్, మహేశ్, సత్యంసాగర్,  సభ్యులు సుబ్బయ్య, శ్రీనివాసులు, ప్రవీణ్​, వెంకటేశ్, నాగశశి,  మహేశ్ పాల్గొన్నారు. 

ఎకరాకు రూ.25 వేల పరిహరం ఇవ్వాలి

అమ్రాబాద్, వెలుగు:  పంట నష్టపోయిన  రైతులకు ఎకరాకు  రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుధవారం అమ్రాబాద్ మండలంలో దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంటలు నాశనం అవుతున్నా ఆఫీసర్లు నష్టాన్ని అంచనా వేయడం లేదన వాపోయారు.  అనంతరం మండల కేంద్రంలో కోతకు గురైన రోడ్లను పరిశీలించారు.  ఇటీవల గుంతలో పడి మృతి చెందిన మునీర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు.  తర్వాత కేజీవీబీని సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.  వంటకు సంబంధించిన మెనూ,  హాస్టల్‌‌ రూముల్లో  ఫ్యాన్లు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఈవోకు ఫోన్‌‌లో ఫిర్యాదు చేశారు.   

తాళాలు పగులగొట్టి సామన్లు తెచ్చుకున్రు

అచ్చంపేట,  వెలుగు: అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌‌స్పెక్టర్‌‌ వనిత 20 రోజుల కింద సిద్దిపేటకు బదిలీ అయ్యారు.  అప్పటి నుంచి కొత్తగా ఎవరినీ నియమించకపోవడంతో ఆమెకు అప్పగించిన గదులు తాళం వేసి ఉంటున్నాయి.  ఆమె కూడా తాళాలు ఎవరికీ ఇవ్వలేదు. అయితే మున్సిపాలిటీకి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్‌‌‌‌ తదితర పారిశుద్ధ్య సామగ్రి ఆఫీస్‌‌, స్టోర్‌‌‌‌ రూముల్లో ఉండిపోయింది. దీంతో బుధవారం మున్సిపల్ చైర్మన్‌‌ నర్సింహ్మ గౌడ్, కమిషనర్ బలరాం నాయక్‌‌కు తాళాలు పగుల గొట్టి సామగ్రిని బయటికి తెచ్చారు.  

పీఎఫ్‌‌ ఉన్న కార్మికులకు పింఛన్ ఇవ్వాలి

వనపర్తి, వెలుగు: పీఎఫ్‌‌ ఉన్న ప్రతి బీడీ కార్మికుడికి పింఛన్‌‌ ఇవ్వాలని ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.  బుదవారం కలెక్టరేట్‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ కటాఫ్ తేదీని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా..  జిల్లా అధికారులు బీడీ కార్మికుల దరఖాస్తులను తీసుకోవడం లేదని మండిపడ్డారు.  జీవన భృతి మంజూరులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం ఏవోకు అందజేశారు.కార్యక్రమంలో నాయకులు సామేలు,  రాజు, వరప్రసాద్, శైలజ, అనిత, లక్ష్మీ, ఇందిరా, షాహిన్ బేగం, ఆశాలత, వెంకటమ్మ, సుజాత, ఆశ్విని, సునీత, భార్గవి  పాల్గొన్నారు.