INS విరాట్ నౌకను రూ.100 కోట్లకు అమ్మేందుకు సిద్ధమైన శ్రీరామ్ గ్రూప్

INS విరాట్ నౌకను రూ.100 కోట్లకు అమ్మేందుకు సిద్ధమైన శ్రీరామ్ గ్రూప్

INS విరాట్ యుద్ధనౌకను అమ్మేందుకు అమ్మాలని నిర్ణయం తీసుకుంది శ్రీరామ్ గ్రూప్.ముంబైకి చెందిన ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు  100 కోట్ల రూపాయాలకు అమ్మేందుకు అంగీకరించినట్లు గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

1987లో ఇండియన్ నేవీలో చేరింది INS విరాట్. అప్పటి నుంచి దేశానికి ఎన్నో సేవలందించి 2017లో విధుల నుంచి తప్పుకుంది. గతేడాది దీన్ని వేలం వేయగా శ్రీరామ్ గ్రూప్ రూ. 38.54 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత దీన్ని గుజరాత్ తీరంలోని అలంగ్ దగ్గర ఉన్న యార్డుకు చేర్చారు.

INS విరాట్ యుద్ధనౌకను మ్యూజియంగా మార్చాలని ముంబైకి చెందిన ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలో భారత రక్షణశాఖ నుంచి ఎన్వోసీ రాగానే రూ. 100 కోట్లకు ఆ సంస్థకు అమ్మేందుకు అంగీకరించినట్టు శ్రీరామ్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు.