పండగ ప్రయాణాలకు 20% డిస్కౌంట్.. కొత్త రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ తెచ్చిన భారతీయ రైల్వేస్

పండగ ప్రయాణాలకు 20% డిస్కౌంట్.. కొత్త రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ తెచ్చిన భారతీయ రైల్వేస్

Indian Railways: దేశంలో ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రయాణ సౌకర్యం రైలు. ఎక్కువ దూరం ప్రయాణాలకు దీనిని విరివిగా భారతీయులు వినియోగిస్తుంటారు. పండుగల సమయాల్లో రద్దీని తగ్గించటంతో పాటు టిక్కె్ట్ బుక్కింగ్స్ సులభతరం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. 

తాజాగా పండుగల సమయాల్లో ప్రయాణం కోసం రౌండ్ ట్రిప్ ప్యాకేజీని పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది ప్రయాణికులకు డిస్కౌంట్లను అందిస్తుంది. పైగా ప్రయాణికుల రద్దీని విస్తరించేందుకు, రైళ్ల ఆక్యుపెన్సీని పెంచటానికి ఇది దోహదపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. స్కీమ్ కింద ప్రయాణికులు నిర్థేశించిన కాలానికి ముందు తిరుగు ప్రయాణానికి టిక్కెట్ బుక్ చేసుకున్నట్లయితే వారికి 20 శాతం బేస్ ఫేర్ రాయితీ అందిచబడనుంది. 

డిస్కౌంట్ పొందాలంటే ఒక్కడే ప్రయాణికులు తన ప్రయాణంతో పాటు తిరుగు ప్రయాణానికి కూడా టిక్కెట్ బుక్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాసింజర్ డిజైట్స్ రెండు ప్రయాణాల్లోనూ మ్యాచ్ కావాల్సిందే. స్కీమ్ అన్ని తరగతులు అలాగే అన్ని రైళ్లకు వర్తించనుంది. స్పెషల్ రైళ్లకు కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయి. అలాగే బుక్కింగ్ ఒకే విధానంలో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 

ALSO READ : రాఖీ సంబరాలు ...బస్సులు ఓవర్ లోడ్..

టిక్కెట్ బుక్కింగ్స్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 13 నుంచి 26 వరకు రైళ్లకు ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. వీటికి రిటర్న్ టిక్కెట్ల బుర్కింగ్ నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు అనుమతించబడుతుంది. కనెక్టింగ్ జర్నీ సదుపాయం ద్వారా రిటర్న్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. 

రిటర్న్ టిక్కెట్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు వర్తించదు. కేవలం రిటర్న్ టిక్కెట్లపై మాత్రమే బేస్ ఫేర్ మీద 20 శాతం తగ్గింపుకు అర్హత ఉంటుంది. వెళ్లేటప్పుడు ఏ క్లాస్ టిక్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కొన్నారో వచ్చేటప్పుడు కూడా అవే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్ కింద ఎలాంటి రీఫండ్ అందించబడదు.