తొక్కిసలాట ఘటనపై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. హత్రాస్ లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మంగళవారం లోక్ సభలో మాట్లాడుతుండగా తనకు ఈ విషాద వార్త అందిందని సభకు తెలిపారు.
మనం చర్చల్లో ఉండగా, నాకు ఒక విషాద వార్త అందింది. యూపీలోని హత్రాస్ లో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారని తెలిసింది” అని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
