రాకెట్‌ పట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాకెట్‌ పట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడలపై తనకు ఉన్న ఆసక్తిని చాటుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌‌లో స్టార్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్‌‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి భవన్‌‌ ఇన్‌‌స్టాలో పోస్ట్‌‌ చేసింది.

పద్మభూషణ్‌‌ అవార్డు గ్రహీత అయిన సైనా.. గురువారం రాష్ట్రపతి భవన్‌‌ కల్చరల్‌‌ సెంటర్‌‌లో జరిగే ‘హర్‌‌ స్టోరీ - మై స్టోరీ’లో ప్రసంగించనున్నారు.