రాష్ట్రపతి ముర్ము యాదగిరిగుట్ట పర్యటన షెడ్యూల్

రాష్ట్రపతి ముర్ము యాదగిరిగుట్ట పర్యటన షెడ్యూల్

శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది మురమ్ము శుక్రవారం యాదగరి గుట్టకు వెళ్లనున్నారు. లక్ష్మీ నర్సింహ్మ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 8.50గంటలకు ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు బయలుదేరనున్నారు. ఉదయం 9.30గంటలకు యాదాద్రి హెలిప్యాడ్ చేరుకోనున్నారు. ఉదయం 9.50 గంటలకు రాష్ట్రపతి ముర్ము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆలయానికి చేరుకుంటారు.  10 నుంచి 10.30 గంటల వరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఉదయం 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తిరిగి రానున్నారు.

భారత15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ద్రౌపదీ ముర్ము యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. 15 మంది రాష్ట్రపతుల్లో ఇప్పటి వరకు నలుగురు మాత్రమే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా ద్రౌపదీ ముర్ము స్వామివారిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు.