రాజ్ఘాట్లో ద్రౌపది ముర్ము నివాళి

రాజ్ఘాట్లో ద్రౌపది ముర్ము నివాళి

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీకి  నివాళులర్పించారు. అనంతరం తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ముర్ము పార్లమెంటు హౌస్ కు చేరుకోనున్నారు. సెంట్రల్ హాల్ లో ఉదయం 10.15 గంటలకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


ఉదయం 9:22 గంటలకు ముర్ము రాష్ట్రపతి భవన్ లోని నార్త్ కోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కావేరీ కమిటీ రూమ్ కు వెళ్లనున్నారు. అక్కడ ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమెకు సాదర స్వాగతం పలకనున్నారు. 9:42గంటలకు కోవింద్, ముర్ము దర్బార్ హాల్ కు చేరుకుంటారు. 9:49 గంటలకు ఫోర్ కోర్టులో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ చివరిసారిగా గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్రపతితో పాటు ద్రౌపది ముర్ము ఊరేగింపుగా పార్లమెంటుకు చేరుకుంటారు. 10:03 గంటలకు వారు పార్లమెంటుకు చేరుకోనున్నారు.