శ్రీశైలం మల్లన్న సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శ్రీశైలం మల్లన్న సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 12 గంటలకు శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. స్వామి వారికి పంచమూర్త అభిషేకం నిర్వహిస్తారు. భ్రమరాంభ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం ప్రాజెక్టు స్కీం ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రిక భవనం, ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. చెంచు ట్రైబల్స్ తో సమావేశం అవుతారు. సాయంత్రం హెలికాప్టర్ లో హకీంపేట్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. 

రాష్ట్రపతి పర్యటనకు ఆంధ్రప్రదేశ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట హెలిప్యాడ్ దగ్గర ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశాయి. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పలుమార్లు ట్రయిల్ రన్ కూడా చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఏపీ చెక్ పోస్ట్ లింగాలగట్టు శిఖరం పాయింట్ దగ్గర, అలాగే తెలంగాణ చెక్ పోస్ట్ దోమలపెంట దగ్గర మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భక్తులకు ఇవా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు బంద్ చేశారు. 

శ్రీశైలం మల్లన్న దర్శనం తర్వాత హెలికాప్టర్ లో 4.15 కు హకీంపేట్ ఎయిర్ బేస్ కు రానున్నారు. అక్కడ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత నేరుగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.