రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటికి శస్త్ర చికిత్స

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటికి శస్త్ర చికిత్స

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇవాళ ఉదయం ఆర్మీ ఆస్పత్రిలో కుడి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ  చేయించుకున్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి ముర్ము కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారని తెలిపారు. 

గత జులై 25వ తేదీన భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కంటి సమస్య ఇబ్బందిపెట్టడంతో ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. కంట్లో శుక్లాలతో ఇబ్బందిపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

వైద్యుల సూచన మేరకు  గత అక్టోబర్ నెల 16వ తేదీన ఎడమ కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఇవాళ కుడి కంటికి కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. రాష్ట్రపతి కుడి కంటికి  శస్త్రచికిత్స చేసిన ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు కంట్లోని శుక్లాలను విజయవంతంగా తొలగించారు.